Home Guards Salary: మాజీ మంత్రి హరీష్‌రావు హోంగార్డులకు రైజింగ్‌డే శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాభద్రత, ట్రాఫిక్ నియంత్రణ, విపత్తు నిర్వహణలో వారి సేవలు ఎంతో విలువైనవని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హోంగార్డుల వేతనాన్ని రూ.9,000 నుంచి రూ.27,600కి పెంచిందని, ట్రాఫిక్ సిబ్బందికి 30% రిస్క్ అలవెన్స్ ఇచ్చిందని గుర్తు చేశారు. మహిళా హోంగార్డులకు ప్రసూతి సెలవులు కల్పించడం, కేసీఆర్ హోంగార్డుల సమస్యలను ప్రత్యక్షంగా పరిష్కరించడం వంటి చర్యలను ఆయన ప్రస్తావించారు.
అలాగే విధుల్లో ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబానికి రూ.5 లక్షల బీమా, కార్యక్రమాల ఖర్చులకు ఇచ్చే మొత్తాన్ని రూ.10,000కి పెంచారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హోంగార్డుల వేతనాలు, భత్యాల కోసం ప్రతి సంవత్సరం రూ.600 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రోజువారీ వేతనాన్ని రూ.921 నుంచి కేవలం రూ.1000 చేసి పెద్ద పని చేసినట్లు చూపిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో 15,000కి పైగా హోంగార్డులు పనిచేస్తున్నా, వారి సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
మంత్రిగా రవీంద్ర జడేజా భార్య ప్రమాణం
సీఎం భూపేంద్ర పటేల్ మినహా గుజరాత్ మంత్రులందరూ రాజీనామా చేశారుసుప్రీంకోర్టులో
External Links:
హోంగార్డులందరికీ రైజింగ్‌డే శుభాకాంక్షలు..