Jurala Water

Jurala Water: కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో తెలంగాణ మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మేఘారెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణకు కృష్ణా జలాలు విడుదల చేయాలని, నారాయణపూర్‌ నుంచి జూరాలకు నీటిని విడుదల చేయాలని కోరారు. జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టుల కింద 5.5 లక్షల ఎకరాల పంటలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం పంటలు కీలక దశలో ఉన్నందున నీటి కొరత లేకుండా నెలకు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కోరారు.

మంత్రుల విజ్ఞప్తిపై డీకే శివకుమార్‌ సానుకూలంగా స్పందించి తెలంగాణ రైతులకు ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో మహబూబ్‌నగర్‌ జిల్లా జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు అధికారులు నీటిని విడుదల చేశారు. నారాయణపూర్‌ నుంచి జూరాలకు దశలవారీగా 15 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యేలు కోరారు. నేడు మరోసారి కర్ణాటక సీఎం, ఇరిగేషన్‌ మంత్రి, అధికారులతో భేటీ కానున్నారు. ప్రస్తుతం నారాయణపూర్‌లో 28 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

 తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…

External Links:

జూరాల నీటిపై మంత్రి కీలక ఆదేశాలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *