Kavitha New Party Launch: తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభమైంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీని ప్రకటించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో జరిగిన సమావేశంలో పార్టీ పేరు “తెలంగాణ రాష్ట్ర సేన (TRS)”గా వెల్లడించారు. ఈ పేరు ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమైంది. కార్యక్రమానికి ముందు కవిత సర్వమత ప్రార్థనలు చేసి, బంజారాహిల్స్‌లోని తన నివాసం నుంచి ర్యాలీగా బయల్దేరి గన్‌పార్కులో అమరవీరులకు నివాళులు అర్పించారు.
ఆ తరువాత సభా ప్రాంగణానికి చేరుకుని ఉదయం 10 గంటలకు పార్టీ పేరును అధికారికంగా ప్రకటించి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ నిర్ణయం బీఆర్‌ఎస్‌కు పెద్ద షాక్‌గా మారింది. సభా ప్రాంగణాన్ని తెలంగాణ సాంస్కృతిక భావాలను ప్రతిబింబించేలా ప్రత్యేకంగా అలంకరించారు. వరంగల్ కాకతీయ కళా తోరణం నమూనాలో ప్రధాన ద్వారం ఏర్పాటు చేయగా, తెలంగాణ తల్లి విగ్రహం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అలాగే డా. బీఆర్ అంబేద్కర్, జ్యోతిరావు ఫులే, ఆచార్య జయశంకర్ విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
కవిత కొత్త పార్టీ పేరు ప్రకటన.. బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్..