Komatireddy Venkat Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తన అంచనా ప్రకారం కాంగ్రెస్కు 100 సీట్లు వస్తాయని, కనీసం 90 స్థానాల్లో విజయం సాధిస్తుందని అన్నారు. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కీలకమని, రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. గాంధీ భవన్లో ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సందీప్ కుమార్తో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత 12 ఏళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందని ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ధి ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రీజినల్ రింగ్ రోడ్డు కోసం 96 శాతం భూసేకరణ పూర్తయినా కేంద్రం కేబినెట్ ఆమోదం ఇవ్వడం లేదని కోమటిరెడ్డి విమర్శించారు. టెండర్ల ప్రక్రియను మూడుసార్లు వాయిదా వేసిందని ఆరోపించారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదాల కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని, రూ.12 వేల కోట్ల ప్రాజెక్టును ఎందుకు పెండింగ్లో పెట్టారని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర నిధులను నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అనుమతులు సిద్ధం చేసినా బీజేపీ జాప్యం చేస్తోందని అన్నారు. తెలంగాణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాజకీయాలకు అతీతంగా పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్రం వెంటనే ఆమోదం తెలపాలని మంత్రి కోరారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు..
External Links:
100 సీట్లు గెలుస్తాం.. మళ్లీ అధికారంలోకి వస్తాం!


