Social Media Ban Under 13: మారుతున్న కాలంలో సాంకేతికత పెరుగుతున్న నేపథ్యంలో పిల్లల భవిష్యత్తు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై పూర్తిస్థాయి నిషేధం విధించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాబోయే 90 రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి విధివిధానాలు ఖరారు చేస్తామని కూడా చెప్పారు.
సోషల్ మీడియా వల్ల పిల్లలు మానసికంగా ప్రభావితమవడం, డిజిటల్ మోసాలు, వల్గర్ కంటెంట్ వంటి సమస్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అందుకే పిల్లలను రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సీఎం పేర్కొన్నారు. అవసరమైతే 13 నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న వారిపై కూడా ఆంక్షలు విధించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే, పిల్లల కోసం సోషల్ మీడియాపై ఆంక్షలు విధించిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచే అవకాశం ఉంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
మంత్రిగా రవీంద్ర జడేజా భార్య ప్రమాణం
సీఎం భూపేంద్ర పటేల్ మినహా గుజరాత్ మంత్రులందరూ రాజీనామా చేశారుసుప్రీంకోర్టులో
External Links:
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి సోషల్ మీడియా బ్యాన్