Yoga Is Not Limited To Any Religion

Yoga Is Not Limited To Any Religion: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ ఫరెడ్ గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యోగా ఏ ఒక్క మతానికీ చెందినది కాదని, దాన్ని మతంతో అనుసంధానించడం సరైంది కాదని అన్నారు. యోగా ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప కానుక అని, ఇది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. యోగా ద్వారా మనిషి సమగ్ర అభివృద్ధిని సాధించగలడని, ఆరోగ్యంగా జీవించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ, యోగా భారత ప్రాచీన సంస్కృతిలో ముఖ్యమైన భాగమని, ప్రతి ఒక్కరూ దాన్ని ఆచరించాలని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ యోగాను ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారని చెప్పారు. యోగా ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, ఒత్తిడి మరియు డిప్రెషన్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుందని తెలిపారు. పిల్లలు, తల్లిదండ్రులు సహా అందరూ యోగా చేయాలని సూచించారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

SIRపై సీఎం రేవంత్ సీరియస్.. గాంధీ భవన్‌లో వార్ రూమ్.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *