Akash Singh Akki On Fire: ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున తొలి మ్యాచ్ ఆడిన యువ ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ సింగ్ చేసిన ‘నోట్ సెలబ్రేషన్’ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వికెట్ తీసిన తర్వాత ఆకాశ్ తన జేబులో నుంచి ఒక చిన్న నోట్ తీసి కెమెరాలకు చూపించాడు. ఆ నోట్‌పై “#Akki On Fire – Akash knows how to take wickets in T20 game” అని రాసి ఉండటంతో అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియో ప్రస్తుతం ఐపీఎల్ అభిమానుల మధ్య విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్‌లో అతడు పవర్‌ప్లేలోనే రుతురాజ్‌తో పాటు సంజు శాంసన్ వికెట్ కూడా తీసి తన జట్టుకు మంచి ఆరంభం అందించాడు.
రాజస్థాన్‌కు చెందిన ఆకాశ్ సింగ్ అండర్-19, దేశీయ క్రికెట్‌లో మంచి ప్రదర్శనలతో గుర్తింపు పొందాడు. ఎడమచేతి ఫాస్ట్ బౌలర్ అయిన అతడు కొత్త బంతితో స్వింగ్ చేయడంలో ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉన్నాడు. 2023లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఆకాశ్, ఇప్పుడు మరో ఫ్రాంచైజీ తరఫున తన ప్రతిభను చాటుతున్నాడు. ఈ మ్యాచ్‌లో అతడి బౌలింగ్‌తో పాటు ప్రత్యేక సెలబ్రేషన్ కూడా హైలైట్‌గా నిలిచింది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ల వికెట్ల తీసిన ఆనందం.. నోట్ సెలబ్రేషన్ వైరల్.!