Cricket Record Scorpion: జింబాబ్వేలో జరిగిన మస్వింగో 50 ఓవర్ ఫస్ట్ లీగ్ మ్యాచ్‌లో స్కార్పియన్ క్రికెట్ క్లబ్ అద్భుత రికార్డు సృష్టించింది. మెథేన్ లయన్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో స్కార్పియన్ జట్టు 50 ఓవర్లలో ఏకంగా 822 పరుగులు చేసింది. ఓపెనర్లు విల్‌ఫ్రెడ్ మటెండే, టకుందా మడెంబో భారీ ఇన్నింగ్స్‌లతో చెలరేగారు. మటెండే 75 బంతుల్లో 203 పరుగులు చేయగా, మడెంబో 143 బంతుల్లో 302 పరుగులు చేసి ట్రిపుల్ సెంచరీ సాధించాడు. తరువాత వచ్చిన విన్సెంట్ మొయో 78, గాబ్రియెల్ జయా అజేయంగా 110 పరుగులు చేశారు. మెథేన్ లయన్స్ బౌలర్లు తీవ్రంగా విఫలమవడంతో పాటు 109 ఎక్స్‌ట్రాలు కూడా ఇచ్చారు.
823 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన మెథేన్ లయన్స్ జట్టు స్కార్పియన్ బౌలర్లకు తట్టుకోలేక కేవలం 28 పరుగులకే కుప్పకూలింది. దీంతో స్కార్పియన్ జట్టు 794 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ అధికారిక లిస్ట్-ఏ మ్యాచ్ కాకపోయినా, ఈ స్కోర్‌కార్డ్ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం అధికారిక లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యధిక జట్టు స్కోరు బిహార్ పేరిట ఉంది. విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్‌పై బిహార్ 574 పరుగులు చేసింది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!