IPL Most Centuries: ఐపీఎల్‌లో సెంచరీ చేయడం చాలా పెద్ద విషయం. ఈ టోర్నీలో ఎన్నో స్టార్ బ్యాటర్లు అద్భుత ఇన్నింగ్స్‌లతో తమ జట్లకు విజయాలు అందించారు. అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, జోస్ బట్లర్, విరాట్ కోహ్లీ ఉన్నారు. సంజూ శాంసన్ ఇప్పటివరకు 5 సెంచరీలు చేసి ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. కేఎల్ రాహుల్, క్రిస్ గేల్ చెరో 6 సెంచరీలతో సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతున్నారు. రాహుల్ పంజాబ్, లక్నో, ఢిల్లీ జట్ల తరఫున శతకాలు సాధించగా, గేల్ ఆర్సీబీ, పంజాబ్ తరఫున భారీ ఇన్నింగ్స్‌లు ఆడాడు.
ఇంగ్లాండ్ స్టార్ జోస్ బట్లర్ 7 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. అతని ఎక్కువ శతకాలు రాజస్థాన్ రాయల్స్ తరఫున వచ్చాయి. ముఖ్యంగా 2022 సీజన్‌లో నాలుగు సెంచరీలు బాది రికార్డు సృష్టించాడు. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను మొత్తం 9 సెంచరీలు సాధించాడు. 2016 సీజన్‌లోనే నాలుగు సెంచరీలు చేసి 973 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. ప్రస్తుతం కూడా తన బ్యాటింగ్‌తో అభిమానులను అలరిస్తూ రికార్డులు సృష్టిస్తున్నాడు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.