Mohit Ulva: అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఒక వికెట్ తేడాతో విజయం సాధించి ట్రోఫీని గెలుచుకుంది. ఈ విజయానికి 18 ఏళ్ల మోహిత్ ఉల్వా కీలకంగా నిలిచాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 26 బంతుల్లో అజేయంగా 49 పరుగులు చేసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ అద్భుత ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చెందిన మోహిత్.. కోచ్ మహేంద్రసిన్హ్ చౌహాన్ దగ్గర శిక్షణ పొందాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణిస్తున్నాడు. ఈ ఆసియా కప్‌లో మూడు వికెట్లు, ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన సిరీస్‌లో ఐదు వికెట్లు తీశాడు. ఫైనల్‌లో తన ప్రతిభను నిరూపించుకున్న మోహిత్ భవిష్యత్తులో భారత సీనియర్ జట్టులో చోటు సంపాదిస్తాడేమో చూడాలి.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు..
External Links:
ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!