ODI World Cup 2027: ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన వెస్టిండీస్‌కు ఇప్పుడు కష్టాలు కొనసాగుతున్నాయి. రెండుసార్లు వన్డే, రెండుసార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన విండీస్.. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయింది. ఐర్లాండ్‌పై అఫ్గానిస్థాన్ విజయం సాధించడంతో విండీస్ టాప్-8 రేసు నుంచి తప్పుకుంది. భారత్‌తో ఇంకా రెండు వన్డేలు ఆడాల్సి ఉన్నా.. వాటిలో గెలిచినా అఫ్గానిస్థాన్‌ను వెనక్కి నెట్టడం కష్టమే. నాలుగేళ్ల క్రితం కూడా విండీస్ వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయింది.
ప్రపంచకప్‌లో చోటు కోసం ఇప్పుడు విండీస్ క్వాలిఫయర్ టోర్నీ ఆడాల్సి ఉంటుంది. 10 జట్లతో జరిగే ఈ టోర్నీలో విజేతగా నిలిస్తే నేరుగా ప్రపంచకప్‌కు వెళ్తుంది. 2 నుంచి 4వ స్థానాల్లో నిలిస్తే చివరి బెర్త్ కోసం జరిగే ‘సూపర్ సిరీస్’ ప్లే-ఆఫ్‌లో అవకాశం లభిస్తుంది. ఈ కఠినమైన పోరును దాటి విండీస్ ప్రపంచకప్‌కు చేరుతుందా అనేది చూడాలి.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్‌కప్ బెర్త్ కోసం పాకులాట!