South Africa Won By 408 Runs

South Africa Won By 408 Runs: దక్షిణాఫ్రికా భారత్‌పై చారిత్రిక విజయాన్ని సాధించింది. IND vs SA టెస్ట్ సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకుంది. గౌహతిలో జరిగిన రెండో టెస్టులో 408 రన్స్ భారీ తేడాతో విజయం నమోదు చేసింది. 2000లో హన్సీ క్రానే కెప్టెన్సీలో కూడా ఇండియా సిరీస్‌ను కోల్పోయిన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో 549 టార్గెట్‌కి బరిలోకి దిగిన టీమిండియా 63.5 ఓవర్లలో 140 రన్స్‌కే ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా స్పిన్నర్ హార్మర్ ఆరు వికెట్లు తీసి భారత్‌ను కూపకూల్చాడు. స్వదేశీ పిచ్‌లపై ఇంత భారీ ఓటమి భారత బ్యాటింగ్ లోపాలను బయటపెట్టింది.

రెండో ఇన్నింగ్స్‌లో జడేజా మాత్రమే అర్థసెంచరీ సాధించాడు. అతను 54 రన్స్ చేసి మహారాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. సాయి సుదర్శన్ 139 బంతులు ఆడినా కేవలం 14 రన్స్ చేశాడు. కెప్టెన్ పంత్ 13 రన్స్ చేసి ఔటయ్యాడు. సుందర్ 16 రన్స్ సాధించగా, నితీశ్ కుమార్ రెడ్డి మాత్రం ఒక్క రన్ కూడా చేయకుండా పెవిలియన్‌కు చేరుకున్నాడు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రెండో టెస్టు తొలి రోజు సెన్సేషన్- కుల్దీప్ యాదవ్ త్రివికెట్లతో సఫారీలను నిలువరించాడు!

నిఖత్ జరీన్‌కు స్వర్ణం..

External Links:

భార‌త్‌కు ప‌రాభ‌వం.. టెస్టు సిరీస్ గెలిచిన ద‌క్షిణాఫ్రికా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *