Suryakumar Yadav Dropped

Suryakumar Yadav Dropped: టీమిండియా టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు మరో షాక్ తగిలింది. అంతర్జాతీయ జట్టులో చోటు కోల్పోయిన సూర్య.. ఇప్పుడు ముంబై రంజీ జట్టులోనూ స్థానం దక్కించుకోలేకపోయాడు. అక్టోబర్ 11న చండీగఢ్‌తో జరిగే మ్యాచ్‌కు సూర్య అందుబాటులో ఉన్నప్పటికీ సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. 18 నెలలుగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడకపోవడంతో తగినంత రెడ్ బాల్ ప్రాక్టీస్ లేదని ముంబై సెలక్షన్ కమిటీ చైర్మన్ రమేశ్ పవార్ తెలిపారు.

మరోవైపు 19 ఏళ్ల అయుష్ మాత్రేను చండీగఢ్ మ్యాచ్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అండర్-19 ప్రపంచకప్‌లో భారత్‌కు టైటిల్ అందించిన అయుష్‌పై సెలెక్టర్లు నమ్మకం ఉంచారు. యశస్వి జైస్వాల్, దివ్యాంశ్ సక్సేనా కూడా ముంబై జట్టులో చోటు దక్కించుకున్నారు. శార్దూల్ ఠాకూర్ గాయం కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. సూర్య ఇటీవల భారత టీ20 కెప్టెన్సీని కూడా కోల్పోయిన నేపథ్యంలో రంజీ జట్టులో చోటు దక్కకపోవడం అతడికి మరో ఎదురుదెబ్బగా మారింది.

“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు..

నిఖత్ జరీన్‌కు స్వర్ణం..

External Links:

పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *