Smriti Mandhana

Smriti Mandhana: హర్మన్‌ప్రీత్ కౌర్ మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో భారత మహిళల జట్టు తదుపరి కెప్టెన్‌గా స్మృతి మంధాన పేరు వినిపిస్తోంది. గతంలో హర్మన్‌ప్రీత్‌కు డిప్యూటీగా వ్యవహరించిన మంధాన, ఆమె అందుబాటులో లేని సమయంలో జట్టుకు నాయకత్వం వహించారు. జింబాబ్వేతో జరగనున్న వైట్‌బాల్ సిరీస్‌కు జట్టును ఎంపిక చేసే సమయంలో మంధానను కెప్టెన్‌గా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కెప్టెన్‌గా మంధానకు మంచి రికార్డు ఉంది. నాలుగు వన్డేల్లో నాయకత్వం వహించిన ఆమె అన్నింటిలోనూ భారత్‌ను గెలిపించగా, టీ20ల్లో 17 పూర్తయిన మ్యాచ్‌ల్లో 11 విజయాలు సాధించారు. భవిష్యత్ ప్రపంచకప్, 2028 ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని మంధానకు బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు..

నిఖత్ జరీన్‌కు స్వర్ణం..

External Links:

బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *