Tg20 Final Hyderabad E Champions

Tg20 Final Hyderabad E Champions:తెలంగాణ TG20 లీగ్ తొలి సీజన్‌లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ విజేతగా నిలిచింది. ఉప్పల్‌లో జరిగిన ఫైనల్లో అన్విత ఖమ్మం ఏసెస్ జట్టును 6 వికెట్ల తేడాతో ఓడించి తొలి ట్రోఫీని కైవసం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఖమ్మం ఏసెస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. మికిల్ జైస్వాల్ 65 పరుగులతో రాణించగా, హైదరాబాద్ తరఫున యశ్వీర్ గౌడ్ 3 వికెట్లు తీశాడు.

158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌కు అభిరథ్ రెడ్డి (48), షణ్ముఖ అశ్విన్ (36), వైష్ణవ్ రెడ్డి (అజేయంగా 41) కీలక ఇన్నింగ్స్ ఆడారు. హైదరాబాద్ 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి తొలి TG20 ఛాంపియన్‌గా నిలిచింది. బ్యాట్, బంతితో మెరిసిన యశ్వీర్ గౌడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

TG20 తొలి ఛాంపియన్‌గా ‘హైదరాబాద్ ఈ ఛాంపియన్స్’.. ఖమ్మం ఏసెస్‌పై 6 వికెట్లతో ఘన విజయం.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *