Gold Cost

14 May 2026 Gold Prices: కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15%కి పెంచడంతో దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.330 పెరిగి రూ.1,62,330కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.300 పెరిగి రూ.1,48,800గా నమోదైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.16,233 కాగా, 22 క్యారెట్ల ధర రూ.14,880గా ఉంది.

అయితే వెండి ధరలు మాత్రం తగ్గి కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.5,000 తగ్గి రూ.3,15,000కు చేరింది. ఢిల్లీలో కూడా వెండి ధర రూ.10,000 తగ్గి రూ.3,00,000గా నమోదైంది. అదే సమయంలో ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,260గా, 22 క్యారెట్ల ధర రూ.1,48,950గా ట్రేడ్ అవుతోంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రూ.14వేలు దాటిన గ్రాము 24K బంగారం…

పసిడి ప్రియులకు మళ్లీ షాక్…

External Links:

15% దిగుమతి సుంకం పెంపు ఎఫెక్ట్.. బంగారం ధర ఎంత? వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *