Apple CEO: ప్రపంచంలో అతిపెద్ద టెక్ సంస్థ యాపిల్ సీఈవోగా పనిచేస్తున్న టిమ్ కుక్ త్వరలో పదవి నుంచి తప్పుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ నెలలో ఆయన వయసు 65కి చేరుకోబోతుండటంతో, వారసుడిపై చర్చలు మొదలయ్యాయి. టిమ్ కుక్ తర్వాత యాపిల్ సీఈవో ఎవరు అవుతారు? అనే ప్రశ్న చర్చనీయాంశం కాగా, ఆ రేసులో జాన్ టర్నస్ పేరు ఎక్కువుగా వినిపిస్తోంది.
ప్రస్తుతం జాన్ టర్నస్ యాపిల్‌లో హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. 24 సంవత్సరాలుగా యాపిల్‌లో ఉన్న ఆయనకు కీలక పదవుల్లో అనుభవం ఉంది. టిమ్ కుక్ కూడా 2011లో సీఈవో అయ్యేటప్పుడు 50 ఏళ్ల వయస్సే ఉండేది; ప్రస్తుతం జాన్ వయసూ 50 ఏళ్లు కావడం గమనార్హం. టర్నస్ 2001లో యాపిల్‌లో చేరి హార్డ్‌వేర్ డెవలప్‌మెంట్‌లో ముఖ్యపాత్ర పోషించారు. టిమ్ కుక్ నుంచి ఆయనకు మంచి గుర్తింపు ఉన్నప్పటికీ, సీఈవో పదవి వదిలే విషయంపై టిమ్ కుక్ ఇంకా ఏ వ్యాఖ్య చేయలేదు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
LG ఎలక్ట్రానిక్స్ షేరు ధర IPO ధర కంటే 51% పెరిగింది..
External Links:
యాపిల్‌ను వీడనున్న టిమ్ కుక్.. ఆయన తర్వాత సీఈవో ఎవరు..?