Gold & Silver: ఎండలతో పాటు బంగారం ధరలు కూడా పెరుగుతూ ప్రజలకు భారం పెడుతున్నాయి. నేడు గోల్డ్ ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ఇన్‌ఫ్లేషన్ భయాలు, ఫెడ్ నిర్ణయాలు, అలాగే అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ధరలు మారుతూ ఉన్నాయి. హైదరాబాద్‌లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం (1 గ్రాము) రూ.15,137, 22 క్యారెట్ల బంగారం రూ.13,875, 18 క్యారెట్ల బంగారం రూ.11,353 వద్ద ఉన్నాయి. తులం పుత్తడిపై రూ.440 పెరిగింది. అయితే వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.440 పెరిగి రూ.1,51,370కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.400 పెరిగి రూ.1,38,750 వద్ద ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,51,530, 22 క్యారెట్లది రూ.1,38,900గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,65,000 వద్ద కొనసాగుతుండగా, ఢిల్లీలో అది రూ.2,60,000గా ట్రేడ్ అవుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రూ.14వేలు దాటిన గ్రాము 24K బంగారం…
External Links:
బంగారం ధరల మంటలు.. నేడు మళ్లీ భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్