Stock Market Indices In Huge Gains

Stock Market Indices In Huge Gains: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ రోజు భారీ లాభాల్లో కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా ఒడిదుడుకులు ఎదుర్కొన్న మార్కెట్‌కు మళ్లీ ఉత్సాహం వచ్చింది. బీహార్‌లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరగడం, ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీఏ కూటమి విజయాన్ని సూచించడం మార్కెట్‌కు కొత్త ఊపునిచ్చాయి. బుధవారం లాభాలతో ప్రారంభమైన సూచీలు ప్రస్తుతం కూడా బలంగా కొనసాగుతున్నాయి. రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 88.63 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్ 473 పాయింట్లు పెరిగి 84,345 వద్ద, నిఫ్టీ 142 పాయింట్లు పెరిగి 25,837 వద్ద కొనసాగుతున్నాయి. నిఫ్టీలో ఓఎన్‌జీసీ, టెక్ మహీంద్రా, టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లాభాలు సాధించగా, శ్రీరామ్ ఫైనాన్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అపోలో హాస్పిటల్స్, ఎస్‌బీఐ లైఫ్, ఆసియన్ పెయింట్స్ నష్టపోయాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.3%, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.5% పెరిగాయి. అన్ని రంగాల సూచీలు లాభాల్లో ఉండగా, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు 1% వరకు పెరిగాయి.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

కొత్త వ్యాపారంలోకి అదానీ ఎంట్రీ..

మెటా లేఆఫ్స్ ఈసారి 600 మంది ఇంటికి..

External Links:

బీహార్ ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్.. భారీ లాభాల్లో సూచీలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *