Taiwan Overtakes India: తైవాన్ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద స్టాక్ మార్కెట్‌గా అవతరించింది. బ్లూమ్‌బర్గ్ డేటా ప్రకారం తైవాన్ స్టాక్ మార్కెట్ విలువ 4.95 ట్రిలియన్ డాలర్లకు చేరుకోగా, భారత్ మార్కెట్ విలువ 4.92 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉంది. దీంతో తైవాన్ భారత్‌ను దాటి ఐదో స్థానంలో నిలిచింది. అమెరికా, చైనా, జపాన్, హాంగ్‌కాంగ్ తర్వాత ఇప్పుడు తైవాన్ ఉంది. భారత్ ఆర్థిక వ్యవస్థ పెద్దదైనా, ఎక్కువ కంపెనీలు లిస్టయ్యినా, భారీ జనాభా ఉన్నా.. చిన్న దేశమైన తైవాన్ ఈ స్థాయికి చేరడం ఆశ్చర్యంగా మారింది. దీనికి ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో పెరుగుతున్న పెట్టుబడులే.
తైవాన్ విజయానికి ప్రధాన కారణం అక్కడి సెమీకండక్టర్ దిగ్గజం TSMC. ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ తయారీ సంస్థ అయిన ఈ కంపెనీకి AI చిప్‌ల డిమాండ్ భారీగా పెరిగింది. తైవాన్ స్టాక్ మార్కెట్‌లో ఈ ఒక్క కంపెనీ వాటా 42 శాతం వరకు ఉంది. ఎన్విడియా, యాపిల్, ఏఎమ్‌డీ వంటి కంపెనీలకు అవసరమైన అధునాతన చిప్‌లను TSMC తయారు చేస్తోంది. దీంతో ప్రపంచ పెట్టుబడిదారులు తైవాన్ మార్కెట్ వైపు ఆకర్షితులవుతున్నారు. మరోవైపు భారత్‌లో పెరుగుతున్న ఇంధన ధరలు, విదేశీ పెట్టుబడుల తగ్గుదల, AI రంగానికి సంబంధించిన పెద్ద కంపెనీలు లేకపోవడం వంటి కారణాలతో మార్కెట్ ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
విషపూరితంగా మారిన కిడ్స్ సిరప్..
SSC GD 2025 ఫలితాలు ssc.gov.in లో విడుదల అయ్యాయి.
External Links:
ఢిల్లీ కంటే తక్కువ జనాభా.. కానీ స్టాక్ మార్కెట్‌లో భారత్‌నే వెనక్కి నెట్టి ఈ చిన్న దేశం..