పల్నాడు: పల్నాడు జిల్లా వినుకొండ మండలం అందుగులపాలెంలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.మృతులు సొలస బాల గంగాధర శర్మ, అతని భార్య, కారు డ్రైవర్‌గా గుర్తించారు. వీరు ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.వాహనంలో ప్రయాణిస్తున్న మరో ఐదుగురు గాయపడగా, ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సాంబశివరావు ధ్రువీకరించారు.ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *