Cyclone Montha: బంగాళాఖాతంలో ఆవిర్భవించి తీవ్ర తుఫానుగా మారిన మొంథా తుఫాన్ ఎట్టకేలకు మంగళవారం అర్ధరాత్రి తీరం దాటింది. భారత వాతావరణ శాఖ (IMD) తెలిపిన ప్రకారం, మచిలీపట్నం–కళింగపట్నం మధ్య, కాకినాడకు దక్షిణంగా ఉన్న నరసాపురం వద్ద తుఫాన్ తీరం దాటింది. రాత్రి 11.30 గంటల నుండి 12.30 గంటల మధ్య ఈ ప్రక్రియ పూర్తయిందని అధికారులు తెలిపారు. తీరం దాటిన తర్వాత కూడా మొంథా భూభాగంపై తీవ్ర తుఫానుగానే కొనసాగుతోంది. తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని వాతావరణశాఖ పేర్కొంది. ప్రస్తుతం మొంథా ఉత్తర–వాయువ్య దిశగా కదులుతూ తెలంగాణ మీదుగా ఛత్తీస్‌గఢ్ వైపు సాగుతోంది. బుధవారం మధ్యాహ్నం నాటికి అది మరింత బలహీనపడే అవకాశం ఉందని తెలిపారు.
తుఫాన్ ప్రభావంతో గడిచిన 12 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లా కావలిలో 23 సెంటీమీటర్లు, ఉలవపాడు లో 17 సెంటీమీటర్లు, చీరాల లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాతావరణశాఖ ప్రకారం, బుధవారం కోస్తా ఆంధ్రా మరియు తెలంగాణ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించబడింది. తదుపరి 24 గంటల్లో ఏపీ, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కేరళ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రఫేల్ ఫైటర్ జెట్‌లో గగన విహారం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఆంధ్రప్రదేశ్‌కి రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..