Mohammad Azharuddin: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ విస్తరణకు సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మహ్మద్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి లభించనుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. వివరాల ప్రకారం, శుక్రవారం అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నిర్ణయానికి ఏఐసీసీ (AICC) ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. రాష్ట్ర మంత్రివర్గంలో మైనారిటీకి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం కీలక సందేశం పంపినట్లయింది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, మైనారిటీ ఓట్లపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. ఇప్పటికే MIM పరోక్ష మద్దతు కూడగట్టిన కాంగ్రెస్, తాజాగా మంత్రివర్గంలో మైనారిటీ ప్రతినిధికి అవకాశం ఇవ్వడం ద్వారా తమ సామాజిక సమతౌల్యాన్ని చూపిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్, ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గణనీయ సంఖ్యలో ఉన్న మైనారిటీ ఓటర్లకు ఇది సానుకూల సంకేతంగా భావిస్తున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రఫేల్ ఫైటర్ జెట్‌లో గగన విహారం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
మొంథా తుఫాన్ తీరం దాటింది – ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు
External Links:
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. మంత్రిగా ఎమ్మెల్సీ అజారుద్దీన్‌కు చాన్స్..!