Rains

Telangana Monsoon Slowdown: తెలంగాణలో నైరుతి రుతుపవనాల పురోగతి ప్రస్తుతం నెమ్మదించింది. ఇవి దక్షిణ తెలంగాణ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల వద్దే నిలిచిపోయే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. జూన్ 17 వరకు ఉత్తర, ఈశాన్య తెలంగాణ వైపు రుతుపవనాలు ముందుకు కదిలే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దీంతో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎండలు, ఉక్కపోత పెరిగే అవకాశం ఉంది. అయితే వేడి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది.

అయితే జూన్ 18 తర్వాత వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో జూన్ 19 నుంచి 23 వరకు తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో రుతుపవనాలు మళ్లీ చురుకుగా మారి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో వచ్చే వారంలో రాష్ట్ర ప్రజలకు ఎండల నుంచి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

విషపూరితంగా మారిన కిడ్స్ సిరప్..

SSC GD 2025 ఫలితాలు ssc.gov.in లో విడుదల అయ్యాయి.

External Links:

విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *