Engineering colleges shut across india: దేశవ్యాప్తంగా విద్యార్థుల అడ్మిషన్లు తగ్గడం, అర్హత కలిగిన ఫ్యాకల్టీ కొరత, మౌలిక సదుపాయాల లోపం వంటి కారణాలతో 2025-26 విద్యా సంవత్సరంలో AICTE ఆధ్వర్యంలో 58 ఇంజనీరింగ్, టెక్నికల్ కాలేజీలను దశలవారీగా మూసివేస్తున్నారు. ఈ ఏడాది నుంచి ఈ కాలేజీల్లో కొత్తగా ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు ఉండవు. అయితే ఇప్పటికే సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు తమ కోర్సును అదే కాలేజీలో పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. కాలేజీలను ఒకేసారి మూసివేయకుండా, ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు ఇబ్బంది లేకుండా క్రమంగా మూసివేస్తున్నారు.
మూతపడిన కాలేజీల్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో అత్యధికంగా 12 చొప్పున ఉండగా, మధ్యప్రదేశ్‌లో 8, తెలంగాణ, పంజాబ్‌లో 4 చొప్పున, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లో 3 చొప్పున ఉన్నాయి. గుజరాత్, కర్ణాటక, తమిళనాడులో 2 చొప్పున, హర్యానా, ఒడిశా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కో కాలేజీ మూతపడింది. వీటిలో కేవలం మూడు మాత్రమే ప్రభుత్వ సాయం పొందే కాలేజీలు కాగా, మిగిలినవి ప్రైవేట్ కాలేజీలు. అలాగే దేశవ్యాప్తంగా డిమాండ్ లేని 950కు పైగా ఇంజనీరింగ్ కోర్సులను కూడా AICTE తొలగించింది. AICTE అనేది దేశంలోని సాంకేతిక విద్యా సంస్థల నాణ్యత, ప్రమాణాలను పర్యవేక్షించే కేంద్ర ప్రభుత్వ సంస్థ.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…