Sandhya Theatre Stampede Case

Sandhya Theatre Stampede Case: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నేడు నాంపల్లి కోర్టులో కీలక విచారణ జరగనుంది. కమిటల్ బాండ్ ప్రక్రియలో భాగంగా కేసులో ఉన్న నిందితులందరూ కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. గత విచారణలో అల్లు అర్జున్ వర్చువల్‌గా హాజరయ్యారు. అయితే ఇద్దరు నిందితులు కోర్టుకు రాకపోవడంతో విచారణను నేటికి వాయిదా వేశారు.

ఈ కేసులో మొత్తం 23 మంది నిందితులు ఉన్నారు. వారందరూ హాజరైన తర్వాతే తదుపరి విచారణ కొనసాగుతుందని కోర్టు తెలిపింది. దీంతో నేటి విచారణకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుతం అల్లు అర్జున్ ముంబైలో ఉండటంతో ఆయన ఈసారి కూడా వర్చువల్‌గానే హాజరయ్యే అవకాశం ఉంది. అయితే దీనిపై అధికారిక సమాచారం ఇంకా రావాల్సి ఉంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. నేడు నాంపల్లి కోర్టు విచారణ.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *