Khairatabad Ganapathi Shobha Yatra: ఖైరతాబాద్ మహాగణపతి టస్కర్‌పైకి చేరి శోభాయాత్రకు బయలుదేరాడు. ఉదయం 6 గంటలకు ప్రారంభం కావాల్సిన యాత్ర క్రేన్‌లో సాంకేతిక సమస్య కారణంగా ఆలస్యమైంది. సమస్యను పరిష్కరించిన తర్వాత గణేశుడిని టస్కర్‌పైకి ఎక్కించి భక్తుల కోలాహలం మధ్య శోభాయాత్ర ప్రారంభించారు. ఎలాంటి డీజే లేకుండా సన్నాయి మేళాలతో గణేషుడిని గంగమ్మ ఒడికి చేర్చనున్నారు. మధ్యాహ్నం 2 గంటల్లోపు నిమజ్జనం పూర్తయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
భారీ గణేషుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ వద్ద కూడా భక్తుల సందడి నెలకొంది. ట్యాంక్‌బండ్ వద్దకు పెద్దసంఖ్యలో గణనాథులు చేరుకుంటుండటంతో భక్తుల రద్దీ పెరిగింది. నిమజ్జనం కోసం ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నంబర్–5 వద్ద అధికారులు భారీ ఏర్పాట్లు చేయగా, భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు…
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు..
External Links:
అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర…