SIR Draft Voter List

SIR Draft Voter List: తెలంగాణలో SIR ప్రక్రియలో భాగంగా నేడు ముసాయిదా ఓటర్ జాబితా విడుదల కానుంది. మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లలో ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించిన 2.64 కోట్ల మంది పేర్లు జాబితాలో ఉంటాయి. ఫారాలు ఇవ్వని 73.39 లక్షల మంది పేర్లు ప్రస్తుతం జాబితాలో ఉండవు. అయితే విచారణ, అభ్యంతరాల తర్వాత అర్హత ఉంటే వారి పేర్లను తుది జాబితాలో చేర్చనున్నారు. అలాగే 93 లక్షల మందికి పైగా ఓటర్ల వివరాల్లో తేడాలు, మ్యాపింగ్ సమస్యలు ఉన్నందున వారికి నోటీసులు జారీ చేయనున్నారు.

నోటీసులు అందుకున్న వారు విచారణకు హాజరై అవసరమైన పత్రాలను సమర్పించాలి. 2002 ఓటర్ జాబితా వివరాల్లో తప్పులు చేసిన 32.36 లక్షల మంది అన్‌మ్యాప్డ్ ఓటర్లకు కూడా నోటీసులు ఇవ్వనున్నారు. పత్రాల పరిశీలన అనంతరం అర్హులైన వారి పేర్లను తుది జాబితాలో చేర్చి, అక్టోబర్ 19న తుది SIR ఓటర్ జాబితాను ప్రకటించనున్నారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

 తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…

External Links:

తెలంగాణలో నేడు ముసాయిదా ఓటర్ జాబితా విడుదల.. 73.39 లక్షల పేర్ల తొలగింపు.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *