Massive Traffic Jam One Way: హైదరాబాద్‌లో కేబీఆర్ పార్క్ పరిసరాల్లో నేటి నుంచి అమలులోకి వచ్చిన వన్‌వే ట్రాఫిక్‌తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన ప్రణాళిక లేకపోవడంతో రోడ్ నెంబర్ 12, మసాబ్ ట్యాంక్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, తెలంగాణ భవన్ మార్గాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఉద్యోగులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుంటుండగా, బైక్‌లు వేడెక్కిపోవడంతో వాహనాలను పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు అంబులెన్స్‌లు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో అత్యవసర సేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి తెలంగాణ భవన్ వరకు రెండు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. ఆఫీసులకు చేరుకోవడానికి రెండు గంటలకు పైగా సమయం పడుతుండటంతో వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…
External Links:
కేబీఆర్ పార్క్ చుట్టూ వాహనదారులకు నరకం.. ఈ రూట్లల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్..