Police Recruitment 7437 Jobs

Police Recruitment 7437 Jobs: తెలంగాణ రాష్ట్రంలో పోలీసు, అనుబంధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 7,437 ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభమైంది. టీజీపీఆర్‌బీ ఆధ్వర్యంలో జరిగే ఈ నియామకాలకు అభ్యర్థులు tgprb.in వెబ్‌సైట్‌లో సెప్టెంబర్ 9 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోలీసు, ఎస్పీఎఫ్, ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖలో ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, వార్డర్, డిప్యూటీ జైలర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 3,697 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి.

ప్రభుత్వం వయోపరిమితిని పెంచడంతో ఈసారి దరఖాస్తుదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దరఖాస్తుల్లో పారదర్శకత కోసం ఆధార్ ఫేస్ అథెంటికేషన్‌ను తప్పనిసరి చేశారు. అభ్యర్థులు ముందుగానే ఆధార్ యాప్‌ను ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. పార్ట్-1, పార్ట్-2 విధానంలో దరఖాస్తు చేసుకుని విద్యార్హత, కుల, నివాస ధ్రువపత్రాలతో పాటు ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా అర్హతకు సంబంధించిన సర్టిఫికెట్లతో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

 తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…

External Links:

తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాలు.. ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *