Jani Master Non Cooperation

Jani Master Non Cooperation: ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనపై సహాయ నిరాకరణ (Non-Cooperation) కొనసాగించాలని అనుబంధ సంఘాల జనరల్ సభ్యులకు ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 26, 27 తేదీల్లో జరిగిన ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ (A.I.F.E.C.) సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు ఫెడరేషన్ తెలిపింది. గత పరిణామాలను పరిశీలించిన అనంతరం, ఫెడరేషన్ సభ్యుల ప్రయోజనాలను కాపాడేందుకు జానీ మాస్టర్‌పై నాన్-కోఆపరేషన్ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

A.I.F.E.C. సమావేశంలో కూడా ఈ నిర్ణయానికి పూర్తి మద్దతు లభించిందని ఫెడరేషన్ తెలిపింది. అనుబంధ సంఘాలు, నాయకులు, సభ్యులందరూ ఈ నిర్ణయాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించింది. వ్యక్తిగత స్వార్థం లేదా స్వలాభం కోసం నిర్ణయాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. జానీ మాస్టర్‌పై సహాయ నిరాకరణ నిర్ణయాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది.

“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *