The Paradise Collections: ‘దసరా’ తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన మాస్ మూవీ ‘ది ప్యారడైజ్’. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ యాక్షన్ డ్రామా తొలి రోజే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. ప్రీమియర్స్‌తో పాటు మొదటి రోజు కలెక్షన్లు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.88 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో నాని కెరీర్‌లోనే ఇది అత్యధిక డే-1 ఓపెనింగ్‌గా నిలిచింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్, ఇతర భాషల మార్కెట్లలోనూ సినిమాకు మంచి స్పందన లభించింది.
ముఖ్యంగా నైజాం ప్రాంతంలో ‘ది ప్యారడైజ్’కు మంచి ఆదరణ లభించింది. తెలుగు, హిందీ, తమిళ మార్కెట్లలోనూ సినిమా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ భారీ హైప్, వీకెండ్, అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్లకు కలిసొచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ‘ది ప్యారడైజ్’ నాని కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్ సాధించిన సినిమాగా నిలిచింది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
నాని ఊచకోత.. కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్…