vijay devarakonda

Vijay Deverakonda: టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండకు గత కొంతకాలంగా సరైన హిట్ దక్కలేదు. 2018లో వచ్చిన ‘గీత గోవిందం’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న తర్వాత వరుసగా ‘డియర్ కామ్రేడ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘లైగర్’, ‘ఖుషి’, ‘ఫ్యామిలీ స్టార్’, ‘కింగ్‌డమ్’ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేకపోయాయి. దీంతో విజయ్ అభిమానులు మరో బ్లాక్‌బస్టర్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆశలన్నీ ‘రణబాలి’ సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమా అక్టోబర్ 16న విడుదల కానుంది. అయితే ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై పెద్దగా బజ్ క్రియేట్ చేయలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది.

‘రణబాలి’కి విడుదలకు ముందు ట్రైలర్‌ కీలకంగా మారింది. ట్రైలర్‌ అదిరిపోయేలా ఉంటే సినిమాపై ఒక్కసారిగా అంచనాలు, బజ్ పెరిగే అవకాశం ఉంది. రష్మిక కూడా సినిమాకు అదనపు బలం కానున్నారు. గీత గోవిందం తర్వాత విజయ్‌కు మరో బ్లాక్‌బస్టర్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ‘రణబాలి’తో విజయ్ మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వస్తాడా, ఆయన కెరీర్‌కు ఈ సినిమా మంచి కమ్‌బ్యాక్ ఇస్తుందా అనేది సినిమా ఫలితమే నిర్ణయించనుంది.

“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *