వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార రకుల్ ప్రీత్ సింగ్. తొలి సినిమాతోనే తనదైన నటన, అందంతో ఆకట్టుకున్న ఈ చిన్నది మంచి విజయాన్ని నమోదుచేసుకుంది. ఆ తర్వాత పలు వరుస విజయాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించున్న ఈ బ్యూటీ.. దాదాపు అందరు యంగ్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది.
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారతీయుడు2తో ప్రేక్షకులకు పలకరించేందుకు సిద్ధమవుతోంది. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నిజానికి ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోవాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యమవతూ వచ్చింది. అయితే తాజాగా రకుల్ ఈ సినిమాలో తన పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. భారతీయుడు2 తన కెరీర్లోనే ప్రత్యేకమైన సినిమాల్లో ఒకటిగా నిలిచిపోతుందని రకుల్ ధీమా వ్యక్తం చేసింది. ఇక తాను పోషించిన పాత్ర కూడా గతంలో కంటే చాలా భిన్నంగా ఉంటుందని, ఈ సినిమాలో తాను ఆత్మవిశ్వాసం కలిగిన అమ్మాయిగా కనిపిస్తానని చెప్పుకొచ్చింది.