Pm Modi Bengal Election Campaign: మే 4న పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రధాని మోదీ అన్నారు. గురువారం రెండో దశ ఎన్నికలు జరగబోయే జిల్లాల్లో ప్రచారం చేస్తూ, కృష్ణానగర్‌లో జరిగిన విజయ సంకల్ప సభలో ప్రసంగించారు. మే 4న విజయోత్సవాలకు సిద్ధంగా ఉండాలని, బాణాసంచా, స్వీట్లు, ఝల్‌మరి పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలని కార్యకర్తలను పిలుపునిచ్చారు. గత 50 ఏళ్లలో తాను చూసిన ఎన్నికల్లో ఇది అత్యంత తక్కువ హింసతో జరిగిన ఎన్నికలని పేర్కొంటూ, శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించిన ఎన్నికల సంఘం మరియు ప్రభుత్వ ఉద్యోగులను అభినందించారు.
పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తొలి దశలో 152 స్థానాల్లో పోలింగ్ జరుగుతుండగా, ఈనెల 29న రెండో దశలో 142 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడతాయి. ఇక్కడ ప్రధానంగా టీఎంసీ మరియు బీజేపీ మధ్య గట్టి పోటీ కొనసాగుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
జోర్డాన్‌లో ప్రధాని మోడీ పర్యటన…
బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్..
External Links:
మే 4న స్వీట్లు, బాణాసంచా సిద్ధం చేసుకోండి.. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మోడీ పిలుపు