AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉన్నారని ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించినట్లు చెప్పారు. గత రెండు నెలలుగా ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ సిద్ధంగా ఉందని తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికలను దశలవారీగా నిర్వహిస్తామని పునేఠా వెల్లడించారు. 2026 ఫిబ్రవరి 5 నాటికి ఉన్న ఫొటో ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా తీసుకుంటామని చెప్పారు. ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు సిద్ధంగా ఉన్నాయని, బ్యాలెట్ పేపర్ల ముద్రణ కోసం ప్రింటింగ్ ప్రెస్ను ఖరారు చేయనున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎన్నికల ప్రక్రియను వేగంగా కొనసాగించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…
External Links:
స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన