Distribute 26401 House Pattas: విజయవాడలో ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమం నిర్వహించనుంది ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు 26,401 మంది పేదలకు ఇళ్ల స్థలాలపై శాశ్వత హక్కులతో పట్టాలు అందించనున్నారు. విజయవాడతో పాటు గన్నవరం, జగ్గయ్యపేట, మైలవరం, నందిగామ, తిరువూరు నియోజకవర్గాల లబ్ధిదారులు పట్టాలు పొందనున్నారు. మొత్తం 707 ఎకరాలు, 34 లక్షల చదరపు గజాల స్థలాలకు సంబంధించిన పట్టాలను పంపిణీ చేయనున్నారు.
విశాఖపట్నం, మంగళగిరిలో ఇప్పటికే వేలాది మందికి పట్టాలు అందించినట్లు ప్రభుత్వం తెలిపింది. విజయవాడ పట్టాలతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 60,646 పట్టాలు పంపిణీ చేశారు. వీటి ప్రభుత్వ విలువ రూ.19,401 కోట్లు కాగా, మార్కెట్ విలువ రూ.52 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అర్హులైన పేదలకు శాశ్వత హక్కులు కల్పించడమే కార్యక్రమం లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…
External Links:
పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు