Chandrababu–Pawan Kalyan Meeting: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య దాదాపు రెండు గంటల పాటు సమావేశం జరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ–జనసేన కూటమి సమన్వయం, సీట్ల సర్దుబాటు, క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల సహకారంపై చర్చించినట్లు సమాచారం. ఏ ప్రాంతంలో ఏ పార్టీ బలంగా ఉందో దాని ఆధారంగా సీట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే కిందిస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సమన్వయం కోసం జాయింట్ మెకానిజం ఏర్పాటు చేయాలని చర్చించారు.
స్థానిక ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యంగా ఇరు పార్టీలు కలిసి పనిచేయాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయించినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో తలెత్తే సమస్యలను వెంటనే పరిష్కరించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. టీడీపీ–జనసేన మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసేలా కార్యాచరణ రూపొందించనున్నారు. ఎన్నికల వ్యూహంపై త్వరలో మరోసారి సమావేశం కావాలని ఇరువురు నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…
External Links:
చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్