కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రిజర్వేషన్ల అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తున్నారు. అక్కడ ఆయన వరుస సమావేశాల్లో పాల్గొంటూ, సందర్భం దొరికినప్పుడల్లా బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై విమర్శలు చేస్తున్నారు. అన్ని వర్గాల వారికి భారత్‌లో పారదర్శక అవకాశాలు లభించే పరిస్థితులు వచ్చిన తర్వాత రిజర్వేషన్ల రద్దు గురించి తమ పార్టీ ఆలోచిస్తుందని ఆయన తెలిపారు
ప్రస్తుతం భారత్ లో ఆదివాసీలు, దళితులు, ఓబీసీలకు సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదని రాహుల్ తెలిపారు. అభివృద్ధిలో వారి భాగస్వామ్యం కూడా అంతంతమాత్రంగా ఉందని పేర్కొన్నారు. కామన్ సివిల్ కోడ్ గురించి ప్రశ్నించగా, దానిపై తాను ఇప్పుడే స్పందించే పరిస్థితి లేదన్నారు. అమెరికాలో ప్రతిష్టాత్మక జార్జ్ టౌన్ యూనివర్శిటీలో విద్యార్ధులను ఉద్దేశించి జరిగిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
.