Ramayana Trailer

Ramayana Trailer: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో, నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం’ ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. గురువారం తెల్లవారుజామున 4:15 గంటలకు మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేయగా, అద్భుతమైన విజువల్స్, గ్రాఫిక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పురాణ కావ్యం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రతి సన్నివేశాన్ని ఎంతో భవ్యంగా చూపిస్తూ విజువల్ ట్రీట్‌గా నిలిచింది. రావణాసురుడిగా యశ్ పవర్‌ఫుల్ ఎంట్రీ, శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ చిత్రంలో లక్ష్మణుడిగా రవి దూబే, కైకేయిగా లారా దత్తా, అలాగే అరుణ్ గోవిల్, రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ డియోల్, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మెర్ అందించిన సంగీతం సినిమాకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. గత టీజర్‌పై వచ్చిన విమర్శలకు ఈ ట్రైలర్‌తో సమాధానం ఇచ్చినట్లు మూవీ టీమ్ భావిస్తోంది. నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితేష్ తివారీ రూపొందిస్తున్న ఈ చిత్రం దీపావళి సందర్భంగా విడుదలై భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుతుందని అంచనా వేస్తున్నారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

బ్రహ్మముహూర్తంలో ‘రామాయణం’ ట్రైలర్ విడుదల.. అద్భుత విజువల్స్‌తో కట్టిపడేసిన మేకర్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *