Mohammad Amir Denies: పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ ఐపీఎల్ 2027 మినీ వేలంలో పాల్గొనబోతున్నారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. బ్రిటిష్ పౌరసత్వం పొందిన ఆయన, బ్రిటన్ ఆటగాడిగా వేలంలో పేరు నమోదు చేసుకుంటారని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను అమీర్ ఖండించారు. తాను ఐపీఎల్ వేలంలో పాల్గొనడం లేదని, తనపై వస్తున్న వార్తల్లో నిజం లేదని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. దీంతో ఆయన ఐపీఎల్‌లోకి వస్తారనే ఊహాగానాలకు తెరపడింది.
34 ఏళ్ల మహమ్మద్ అమీర్ 2024లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. పాకిస్థాన్ తరఫున 36 టెస్టులు, 61 వన్డేలు, 62 టీ20 మ్యాచ్‌లు ఆడి మొత్తం 259 వికెట్లు తీశారు. 2026 మేలో బ్రిటిష్ పౌరసత్వం పొందిన ఆయన, ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో స్థానిక ఆటగాడిగా కౌంటీ, టీ20 టోర్నీల్లో ఆడుతున్నారు. నాటింగ్‌హామ్‌షైర్ తరఫున టీ20 బ్లాస్ట్, ట్రెండ్ రాకెట్స్ తరఫున ‘ది హండ్రెడ్’ టోర్నీలో పాల్గొన్నారు. ప్రస్తుతం వివిధ దేశాల్లో జరిగే ప్రైవేట్ టీ20 లీగ్‌లలో ఆడుతున్న అమీర్, ఐపీఎల్ 2027లో మాత్రం పాల్గొనడం లేదని స్పష్టం చేశారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు..
External Links:
ఐపీఎల్ 2027 వేలంలో పాకిస్థాన్ ఆటగాడు..? డిసెంబర్ 16న మినీ వేలం..