India First Bullet Train: భారత్‌లో తొలిసారిగా స్వదేశీ సాంకేతికత, డిజైన్‌తో బుల్లెట్ రైలును తయారు చేస్తున్నారు. ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ కారిడార్ కోసం రూపొందిస్తున్న ఈ రైలును ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బెంగళూరులోని బీఈఎంఎల్ తయారీ కేంద్రంలో పరిశీలించారు. ఈ రైలు గరిష్టంగా గంటకు 280 కిలోమీటర్ల వేగంతో పరీక్షలు నిర్వహించుకునేలా, ప్రయాణికులతో గంటకు 249 కిలోమీటర్ల వేగంతో నడిచేలా రూపొందిస్తున్నారు. 8 కోచ్‌లతో ఉండే ఈ రైలులో ఒకేసారి 557 మంది ప్రయాణించవచ్చు.
ప్రయాణికుల సౌకర్యం కోసం విశాలమైన సీట్లు, ఏసీ, వైఫై, ఛార్జింగ్ పాయింట్లు, ఆధునిక టాయిలెట్లు, లగేజీ సదుపాయాలు కల్పిస్తున్నారు. దివ్యాంగులకు ప్రత్యేక సీట్లు, టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నారు. రైలు వేగంగా వెళ్లేటప్పుడు శబ్దం, గాలి ఒత్తిడి తగ్గించేలా ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. అలాగే విద్యుత్ ఆదా కోసం రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ బుల్లెట్ రైలు ద్వారా ప్రయాణికులకు వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…
External Links:
గంటకు 280 కి.మీ వేగం.. వై-ఫై నుంచి లగ్జరీ సీట్ల వరకు.. భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ విశేషాలు