US Plane Crash

US Plane Crash: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం గ్రీన్‌ఏకర్స్‌లో ఆదివారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. నివాస ప్రాంతంలో లియర్‌జెట్ 60 విమానం కుప్పకూలడంతో 9 మంది మరణించారు. ఈ విమానం టెక్సాస్‌లోని ఆస్టిన్ విమానాశ్రయం నుంచి బహామాస్‌కు వెళ్తోంది. 35 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో విమానంపై మంచు పేరుకుపోవడం, గాలి ఒత్తిడి కారణంగా సమస్యలు తలెత్తినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పైలట్లు ఎత్తు పెంచేందుకు అనుమతి కోరారు. విమానం 41 వేల అడుగులకు చేరుకున్న తర్వాత ఒక్కసారిగా వేగంగా కిందికి దిగి నేలను ఢీకొట్టింది. దీంతో విమానం మంటల్లో చిక్కుకుని పూర్తిగా ధ్వంసమైంది.

విమానం కూలిపోతున్న సమయంలో పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లతో మాట్లాడిన ఆడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. విమానం అదుపు తప్పుతోందని, వేగంగా కిందికి దిగుతోందని పైలట్లు పదేపదే హెచ్చరించారు. మహిళా సిబ్బంది కూడా భయంతో అరిచినట్లు ఆడియోలో వినిపించింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఏటీసీ అధికారులు చివరి వరకు పైలట్లతో మాట్లాడారు. అయితే విమానం వేగం పెరిగి నియంత్రణ కోల్పోవడంతో చివరకు కుప్పకూలింది. ఈ ప్రమాదానికి సంబంధించిన సంభాషణలు అందరినీ కలచివేస్తున్నాయి.

“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

 తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…

External Links:

జకీర్ నాయక్ వాదనను వ్యతిరేకించిన భారత్, పాక్, ఆఫ్ఘన్ మేధావులు.. అసలు ఏం జరిగిందంటే..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *