PV Sindhu: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు జపాన్ ఓపెన్ 2026లో అద్భుత ప్రదర్శనతో తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 4వ ర్యాంకర్, ఒలింపిక్ ఛాంపియన్ చెన్ యుఫెయ్‌ను సింధు ఓడించింది. మొదటి గేమ్‌లో ఇద్దరూ హోరాహోరీగా పోటీపడగా, 19–19తో సమమైన సమయంలో సింధు వరుస పాయింట్లు సాధించి 21–19తో గేమ్‌ను గెలుచుకుంది. ఈ విజయంతో చెన్ యుఫెయ్‌పై గత ఐదు మ్యాచ్‌లుగా కొనసాగుతున్న ఓటముల పరంపరకు కూడా సింధు ముగింపు పలికింది. మ్యాచ్‌లో ఇద్దరి మధ్య జరిగిన 51 షాట్ల ర్యాలీ అభిమానులను ఆకట్టుకుంది.
రెండో గేమ్‌లో కూడా సింధు ఆధిక్యం కొనసాగించింది. స్కోరు 15–10 వద్ద ఉండగా చెన్ యుఫెయ్ హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా మ్యాచ్‌ను మధ్యలోనే వదిలేయడంతో సింధు విజేతగా నిలిచింది. 2024 సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ తర్వాత బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్‌లో ఫైనల్‌కు చేరడం సింధుకు ఇదే మొదటిసారి. ఇక ఆదివారం జరిగే ఫైనల్లో జపాన్‌కు చెందిన అకానె యామగూచి లేదా ఇండోనేషియా క్రీడాకారిణి పుత్రి కుసుమ వర్దానితో సింధు టైటిల్ కోసం పోటీ పడనుంది. ఇప్పటికే ప్రపంచ 5వ ర్యాంకర్ హాన్ యుయే, ప్రపంచ 4వ ర్యాంకర్ చెన్ యుఫెయ్‌లను ఓడించిన సింధు, ఇదే జోరును కొనసాగించి ఈ సీజన్ తొలి టైటిల్‌ను గెలవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
చెన్ యుఫెయ్‌పై పీవీ సింధు సంచలన విజయం.. కెరీర్‌లో తొలిసారి జపాన్ ఓపెన్ ఫైనల్లోకి!