SRH IPL 2026

SRH IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ప్రయాణం ఎలిమినేటర్ దశలోనే ముగిసింది. మే 27న ముల్లాన్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో SRH 47 పరుగుల తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి బయటపడింది. అయితే ఈ సీజన్‌లో హైదరాబాద్ బ్యాటింగ్ విభాగం అద్భుతంగా రాణించింది. ముఖ్యంగా ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ ఇద్దరూ 600కు పైగా పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో ఒకే జట్టు తరఫున 600+ పరుగులు చేసిన 7వ జోడీగా నిలిచారు. ఈ జాబితాలో గతంలో క్రిస్ గేల్-విరాట్ కోహ్లీ, కోహ్లీ-ఏబీ డివిలియర్స్, రుతురాజ్-ఫాఫ్, గిల్-సాయి సుదర్శన్ వంటి జోడీలు ఉన్నాయి.

ఎలిమినేటర్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 243 పరుగుల భారీ స్కోరు చేసింది. వైభవ్ సూర్యవంశీ 29 బంతుల్లో 97 పరుగులతో చెలరేగగా, ధ్రువ్ జురెల్ 21 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అనంతరం 244 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన SRHను రాజస్థాన్ బౌలర్లు కట్టడి చేశారు. జోఫ్రా ఆర్చర్ 3 కీలక వికెట్లు తీయగా, జడేజా, సుశాంత్ మిశ్రా, నాండ్రే బర్గర్ తలో రెండు వికెట్లు సాధించారు. దీంతో హైదరాబాద్ జట్టు 196 పరుగులకే ఆలౌట్ అయి 47 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

ఓడినా చరిత్ర సృష్టించిన కాటేరమ్మకొడుకులు.. ఐపీఎల్ హిస్టరీలోనే అరుదైన ఎలైట్ లిస్ట్‌లో చోటు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *