Rashmika Mandanna First Public Appearance: గాయం కారణంగా కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న రష్మిక మందన్న తాజాగా భర్త విజయ్ దేవరకొండతో కలిసి హైదరాబాద్లో జరిగిన ఓ నిశ్చితార్థ వేడుకలో కనిపించారు. ‘మైసా’ షూటింగ్లో గాయపడటంతో ఆమె సర్జరీ చేయించుకుని ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఈ వేడుకలో నలుపు, బంగారు రంగుల లెహంగాలో రష్మిక, బ్లాక్ కుర్తాలో విజయ్ ఆకట్టుకున్నారు. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రష్మిక ‘మైసా’తో పాటు విజయ్ దేవరకొండతో కలిసి ‘రణబాలి’లో నటిస్తున్నారు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్లీ షూటింగ్లకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. తాజా వేడుకలో రష్మిక ఉత్సాహంగా కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
సర్జరీ తర్వాత తొలిసారి బయటకు.. భర్త విజయ్ దేవరకొండతో రష్మిక సందడి!