Tirumala Rs 300 Darshan Tickets

Tirumala Rs 300 Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సమాచారం వెల్లడించింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను నేడు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. 12, 13, 14, 18, 19, 20వ తేదీలకు సంబంధించిన టికెట్లు అందుబాటులో ఉంటాయి. రోజుకు 10 వేల చొప్పున మొత్తం 60 వేల టికెట్లను టీటీడీ జారీ చేయనుంది. భక్తులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలి. అలాగే, నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో 11 నుంచి 20వ తేదీ వరకు ప్రివిలేజ్, వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉండగా, టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 73,629 మంది భక్తులు దర్శించుకోగా, 27,525 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ద్వారా రూ.5.33 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది.

“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు…

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు..

External Links:

శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *