Gold Cost

Gold Rate Today November 19: బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ఊరటనిచ్చే వార్త. దేశీయ మార్కెట్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,570 తగ్గి రూ.1,30,690కి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.2,350 తగ్గి రూ.1,19,800గా నమోదైంది. ఇక కిలో వెండి ధర మరోసారి రూ.5,000 తగ్గి రూ.1,80,000కి దిగివచ్చింది.

అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల కారణంగా విలువైన లోహాల ధరలు భారీగా పడిపోయాయి. అమెరికా డాలర్ బలపడటం, ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ పెరగడం, వడ్డీ రేట్లపై అంచనాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో డిసెంబర్ 4 గడువు గల బంగారం ఫ్యూచర్స్ ధర 3.24 శాతం తగ్గి 10 గ్రాములకు రూ.1,29,880కి చేరగా, వెండి ఫ్యూచర్స్ ధర 5.26 శాతం పడిపోయి కిలోకు రూ.1,60,775గా నమోదైంది.

“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…

ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..

External Links:

కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. మరోసారి భారీగా బంగారం, వెండి ధరల పతనం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *