India 22k 24k Gold Price 18 May: కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకం పెంచడం, వెండి దిగుమతులపై ఆంక్షలు విధించడం వల్ల మార్కెట్‌లో ప్రభావం కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో మార్పుల కారణంగా బంగారం, వెండి ధరలు కూడా హెచ్చుతగ్గులు ఎదుర్కొంటున్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుతుండగా, ఈరోజు కూడా తులం బంగారం ధర రూ.710 తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.15,622గా, 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.14,320గా, 18 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.11,717గా నమోదైంది.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 తగ్గి రూ.1,56,220కు చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.650 తగ్గి రూ.1,43,200 వద్ద ట్రేడ్ అవుతోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,370గా, 22 క్యారెట్ల ధర రూ.1,43,350గా ఉంది. మరోవైపు వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.10,000 పెరిగి రూ.3,00,000కు చేరగా, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,90,000గా నమోదైంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రూ.14వేలు దాటిన గ్రాము 24K బంగారం…
External Links:
గోల్డ్, సిల్వర్ ధరల్లో ఇంత మార్పా?.. నేటి ధరలు ఇవే