Microsoft Layoffs Tech Giant: మైక్రోసాఫ్ట్ (Microsoft) మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగ కోతలకు సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం ఉద్యోగుల్లో సుమారు 2.5 శాతం మందిని, అంటే 5,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), జెనరేటివ్ ఏఐ రంగాల్లో భారీ పెట్టుబడులు పెడుతోంది. ఈ ఖర్చులను తగ్గించేందుకు సేల్స్, కన్సల్టింగ్, గేమింగ్ విభాగాల్లో ఉద్యోగులను తగ్గించే ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌లో సుమారు 2.2 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.
అమెరికా ఉద్యోగుల కోసం మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ప్రత్యేక స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) పథకాన్ని కూడా తీసుకొచ్చింది. గత నెలలో కంపెనీ షేర్ ధర 17 శాతం పడిపోవడం, హార్డ్‌వేర్ తయారీ ఖర్చులు పెరగడంతో ఎక్స్‌బాక్స్ ధరలను కూడా పెంచింది. గత ఏడాది మేలో 6,000 మంది, జూలైలో మరో 9,000 మంది ఉద్యోగులను తొలగించిన కంపెనీ.. ఇప్పుడు మరో 5,000 మందికి పైగా లేఆఫ్స్ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తుండటంతో ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన పెరిగింది. అయితే ఈ వార్తలపై మైక్రోసాఫ్ట్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….